ఉంగుటూరులో మంగళవారం యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణం వద్ద బారులు తీరారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో, సదరు దుకాణంలో స్టాక్ ఉన్నట్లు సమాచారం రావడంతో పరిసర గ్రామాల రైతులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఎరువుల కొరత కారణంగా పంటల పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.