రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ కలిసారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న CRT ఉపాధ్యాయుల వేతనాలు ఇవ్వాలని కోరగా సోమవారం నుండి వాళ్లకు వేతనాలు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన రహదారులకు నిధుల మంజూరు, జైనూర్ ప