Download Now Banner

This browser does not support the video element.

ఎలమంచిలి అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం: అగ్నిమాపక అధికారి డి.రాంబాబు

India | Apr 14, 2024
ఎలమంచిలి అగ్నిమాపక కేంద్రంలో ఆదివారం అగ్నిమాపక శాఖ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం అగ్నిమాపక యంత్రాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తామని రాంబాబు తెలిపారు. వేసవిలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us