ఉపాధ్యాయులు సమాజానికి మార్గ నిర్దేశకులని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఉపాధ్యా యుడు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.