వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రైతు పోరు కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జిల్లాలోని ఆర్డీవో కార్యాలయాల వద్ద నిర్వహించే రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివారం మధ్యాహ్నం గజపతినగరంలో వైసిపి రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. గజపతినగరం వైసీపీ కార్యాలయంలో రైతు పోరు కరపత్రాన్ని ఆవిష్కరించారు. జెడ్పిటిసిలు గార తవుడు, వర్రి నరసింహమూర్తి, వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పీరుబండి జైహింద్ కుమార్, వైసీపీ గజపతినగరం మండల అధ్యక్షుడు బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.