మత్తు ఏ రూపంలో ఉన్న అది నేరమేనని నార్కోటిక్ DSP రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏటూరునాగారం డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రమేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాల వైపు వెళ్ళొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాల వాడకం, అమ్మకం, వారికి ఆశ్రయం ఇవ్వడం కూడా నేరమన్నారు. ప్రిన్సిపల్ రేణుక, వెంకటయ్య, నవీన్, తదితరులు పాల్గొన్నారు.