ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మంగళవారం పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ వద్ద గణనాథుల నిమజ్జనం ఏర్పాట్లను పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు కాంగ్రెస్ నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి పట్టణం నుండి లక్నాపూర్ ప్రాజెక్టుకు వచ్చే నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గణనాథుల నిమజ్జనం శాంతియుతంగా భక్తి భావంతో ఎలాంటి సమస్యలు లేకుండా భక్తులు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయుబ్, కాంగ్రెస