Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 3, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, ఇనగలూరు గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసి ఉన్నారన్న సమాచారంతో అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడులలో 200 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడులలో సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, తదితరులు ఉన్నారు.