వినాయక చవితి వేడుకలలో భాగంగా శుక్రవారం నాడు రైల్వేకోడూరు పట్టణం లోని పలు వినాయక మండపాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ పరిధి లోని కొత్త బజార్, రాయల్ స్ట్రీట్, చిన్నపిల్లల దేవాలయం, సిల్వర్ బెల్స్ స్కూల్ పక్కన, లాలా పేట ఆంజనేయస్వామి గుడి వీధిలో, బలిజవీధి, పగడాలపల్లి కనకదుర్గ లేతు దగ్గర మరియు ఇమామ్ సాహెబ్ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు బత్యాల ని శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.