వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన దొడ్ల నర్సింలు అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుండగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి చికిత్స కొరకు రెండు లక్షల రూపాయల విలువగల చెక్కును అందజేశారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు ఉపయోగపడుతుందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.