కుందుర్పి మండల కేంద్రంలో పురాతనమైన, పవిత్రమైన వెంకటరమణ స్వామి ఆలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి అయిందంటే దేవాలయంలోకి ప్రవేశిస్తున్నారు. మద్యం సేవిస్తున్నారు. అంతే కాకుండా సిగరెట్లు, బీడీలు తాగుతున్నారు.గుట్కా నమిలి అక్కడే ఉమ్మి వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో దేవాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పోలీసులు నిఘా వేసి దేవాలయంలోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.