నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామ చెరువు అలుగు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమయ్యింది. ఉదయం అటువైపు వెళ్లిన గ్రామస్తులకు అలుగు వద్ద మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తెల్లని బనియన్, బ్లూ కలర్ అండర్వేర్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. గత మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటాడని గుర్తించారు. ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.