నల్లగొండ జిల్లా: ముఖ్యమంత్రి సహాయా నిధి పేదలకు వరం లాంటిది అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం అన్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ పరిధిలోని కేతపల్లి నకిరేకల్ నార్కట్పల్లి చిట్యాల మండలాలకు సంబంధించిన 207 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 73 లక్షల 65 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.