కర్నూలు ఉల్లికి కనీస మద్దతు ధర ఇవ్వడంలో వ్యాపారుల తీరుపై జిల్లా కలెక్టర్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె ఉల్లి రైతులతో మాట్లాడారు. ఒకానొక సందర్భంలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో వ్యాపారుల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కిలో 6 నుంచి 9 రూపాయలకు పెంచి ఇవ్వాలని ఆదేశించారు. తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ ఉన్నారు.