వెల్గటూర్ మండలం కప్పరావుపేట గ్రామానికి చెందిన గండ్ర రంగారావు అనే నాయకులు ఇటీవల మృతి చెందారు.ఈ సందర్బంగా శనివారం రోజున నిర్వహించిన వారి పెద్ద కర్మ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాజరాంపల్లి గ్రామానికి చెందిన మ్యకల నరేష్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంట మండల నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు, మద్దుల గోపాల్ రెడ్డి, విజేందర్ రెడ్డి, రాం రెడ్డి, జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.