కాకినాడ జిల్లా పిఠాపురం టిడ్కో గృహాల వద్ద కనీస మౌలిక వసతులు కల్పించాలని పిఠాపురం టౌన్ సీపీఐ కార్యదర్శి సాకా రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం సాయంకాలం 3 గంటలకు సీపీఐ బృందం పిఠాపురం టిడ్కో గృహాలను పరిశీలించి, అక్కడ నివసించే ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయని, డ్రైనేజీ నీరు బయటకు వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి ప్రజలకు వసతులు కల్పించాలని కోరారు.