సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపురం శివారులో విద్యుత్ షాక్తో మంగళవారం ఓ గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన మేకల సంతోష్ తన గేదెను మేత కోసం పొలానికి తీసుకెళ్లారు. పచ్చిక మేస్తున్న గేదె ప్రమాదవశాత్తు వేలాడుతున్న విద్యుత్ వైర్లకు తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ రూ. లక్ష ఉంటుందని బాధితుడు సంతోష్ తెలిపారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.