తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం బంగారంపేట గ్రామానికి చెందిన తన కుమార్తె కట్టా వెన్నెల అదృశ్యమైనట్లు తండ్రి శేషయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 28వ తేదీన బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ వెతికిన కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తండ్రి శేషయ్య మంగళవారం తెలిపారు. ఈ మేరకు పెళ్ళకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బాలిక ఆచూకీ తెలిస్తే పెళ్లకూరు పోలీస్ స్టేషన్ నెంబర్ 9440796358 సంప్రదించాలని పెళ్లకూరు పోలీసులు కోరారు.