నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని 5వ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ వ్యాధి నిరోధక టీకాలను పిల్లలకు వేస్తున్నారు. బుధవారం జిల్లా DIO డాక్టర్ సుదర్శన్ టీకాల ప్రక్రియను తనిఖీ చేశారు. టీకాల వివరాలు అడిగి తెలుసుకొని, రికార్డులను పరిశీలించారు. ప్రతీ బిడ్డకు 100% టీకాలు వేసేవిధంగా పనిచేయాలని ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ జగదీశ్వరప్ప, హెల్త్ సూపర్ వైజర్ మునిస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.