సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఆగస్టు 30 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై మాట్లాడాలని కోరుతూ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డికి తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గురువారం తెలంగాణ యువజన సంఘం నాయకులు మధు సంతోష్ సునీల్ మాట్లాడుతూ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ త్వరగా అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంతో అసెంబ్లీలో పోరాటం చేరని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.