మంగపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషంట్, ల్యాబ్ టెక్నీషియన్, డెలివరీ, మందుల నిల్వల గదులను పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.