ఆదివాసి ప్రాంతాల్లో పెద్ద ఐటీడీఏ అయినా పాడేరు ఐటీడీఏ నూతన ప్రాజెక్టు అధికారిగా విధులకు వచ్చిన తిరుమణిశ్రీ పూజ మన్యం ఆరాధ్య దేవత పాడేరు మోదకొండ మామ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక జ్ఞాపకం అందజేసి ఘనంగా సత్కరించారు.