ఈనెల 9న వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహిస్తున్నట్లు వైసీపీ భీమవరం ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు తెలిపారు. రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నామని, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆర్థికంగా దోచుకుంటోందని ఆయన విమర్శించారు.