ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో వైసిపి మండలాధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి కట్టడాలను అధికారులకు కూల్చివేయడానికి పూనుకున్నారు. దీంతో వైసిపి నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం దర్శి వైసీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.