శుక్రవారం రోజున పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలో వైద్యశాఖ అస్తవ్యస్తంగా ఉందని ప్రభుత్వాసుపత్రిలో బెడ్స్ లేక నవారు మంచాలపై వైద్యం అందిస్తున్నారని సామాజిక మద్యమాల్లో వార్త పత్రికల్లో వ్యతిరేక వార్తలు ప్రచారం అవుతున్నాయన్నారు పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తున్న కారణంగా మాతాశి కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని స్థల సమస్య ఉన్న ఆసుపత్రికి వచ్చే రోగులను వెనక్కి పంపించకుండా వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వాసుపత్రి పై వ్యతిరేక ప్రచారం చేయవద్దంటూ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు