పంట రుణాలు సత్వరమే అందించాలని విత్తనాలు ఎరువులు కొరత లేకుండా చూడాలని సిపిఎం ఆధ్వర్యంలో చర్ల పిఎసిఎస్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.