గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వ అవినీతిపై జడ్పిటిసిలు ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రులు ముఖం చాటేసారంటూ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఘాటుగా విమర్శించారు శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఒక్క సంవత్సర కాలంలో ప్రజలలో ఇంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి తప్ప ఎవరికీ రాలేదన్నారు మరో ప్రశ్నకు బదులుగా సమాధానం ఇస్తూ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు