వినాయక చవితి ఉత్సవాలు అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి... విజ్ఞాలు తొలగించే వినాయకుడిని ప్రతిష్టించుకుంటే అన్ని విఘ్నాలు తొలుగుతాయని ప్రజలు నమ్మకంతో తమ ఇళ్లలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను కూడా ప్రతిష్టించుకునేందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. వినాయక చవితిని పురస్కరించుకొని అదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ ప్రాంతం తో పాటు అంబేద్కర్, గాంధీ చౌక్ అశోక్ రోడ్ ప్రాంతాలన్నీ సందడిగా మారిపోయాయి.. విగ్రహాల కొనుగోలు తో పాటు పూజ సామాగ్రి కి అవసరమయ్యే వస్తువుల కొనుగోలుతో పట్టణంలో సందడి మారింది