నరసరావుపేట మండలం కాకాని గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ఎమ్.ఐ. ట్యాంక్ చేపల చెరువు వేలంపాటలో ముండ్లమూరి కోటేశ్వరరావు విజయం సాధించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ మధులత మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.5,33,500తో ప్రారంభమైన వేలంపాటలో చుండి కొండలరావు, ముండ్లమూరి కోటేశ్వరరావు పాల్గొనగా, రూ.10,10,000లకు కోటేశ్వరరావు పాటను గెలుచుకున్నారని తెలిపారు.