Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దాహనం చేసినట్లు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీహార్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో దేశ ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దాహనం చేసినట్లు తెలిపారు.ఇనేపద్యంలో పోలీసులు చేరుకొని నిశిదర్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.