చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి కెనరా బ్యాంక్ సౌజన్యంతో సుమారు ₹5,50,000 విలువైన ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందజేశారు. ఈ వాహనాన్ని ఆలయానికి విచ్చేసే వికలాంగులు, వృద్ధులు సౌకర్యవంతంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. విరాళ వాహనాన్ని దేవాదాయ శాఖ డీఈఓ సాగర్ బాబు గారికి కెనరా బ్యాంక్ ప్రతినిధులు అందజేశారు.