మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా కొరతకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమకు సరిపడా యూరియా వెంటనే అందించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉందని, ఓపికతో వ్యవహరించాలని పోలీసులు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.