విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి పోలీసు స్టేషన్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆగస్టు 28న ఆకస్మికంగా సందర్శించి, స్టేషను ప్రాంగణంను పరిశీలించి, పోలీసు స్టేషను రికార్డులు, సిడి ఫైల్సున్ను తనిఖీ చేసి, స్టేషను ప్రాంగణంలో పార్కింగు చేసి ఉన్న వాహనాలు గురించి ఎస్ఐని అడిగి తెలుసుకొని, వాటిని త్వరితగతిన సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, మాట్లాడుతూ నేరాల నియంత్రణ, కేసుల మిస్టరీ ఛేదనలో సిసి కెమెరాలు చాలా ముఖ్య భూమికను పోషిస్తున్నాయన్నారు. నేర నియంత్రణలో భాగంగా పోలీసు స్టేషను పరిధిలో సాధ్యమైనన్ని ఎక్కువ సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా