భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు వృద్ధులు,వితంతులు, వికలాంగులతో సమావేశం నిర్వహించినట్లు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా నాయకుడు నోముల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ వికలాంగులకు 6000 పెంచిఇవ్వాలని ఈనెల 8న జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వృద్ధులు,వికలాంగులు వితంతువులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.