ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని దోమ ఎస్ఐ వసంతు జాదవ్ తెలిపారు. నేడు మంగళవారం ర వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలలో డీజేలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరు భక్తి భావంతో జరుపుకోవాలని యువత శనికావేశం లో తప్పులు చేసి కేసుల్లో చిక్కుకోవద్దన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని చట్టం తన పని చేసుకుంటుందని తెలిపారు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి సెకండ్ అత్యంత ముఖ్యమైనది అని తెలిపారు. వివాదాలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుక