పురుగుల మందు సేవించే వివాహిత ఆత్మహత్య చేసుకుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోకవర్గ పరిధిలోని చిట్యాల మండలంలోని నైన్ పక్క గ్రామానికి చెందిన మారపల్లి స్వప్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు శనివారం రాత్రి 8 గంటలకు తెలిసింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించిన ఆమె కుటుంబ సభ్యులు కొద్దిసేపటికి గుర్తించి ఆసుపత్రికి తరలించే లోపే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. కాగా మృతికి గల కారణాలు తెలియ రాలేదు ఈ మేరకు గాను కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలియజేశారు.