రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని EO శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఏడో తేదీన ఘటోత్సవం, 10న అమ్మవారి నిలుపు, 11న అమ్మవారిని వెళ్లనంపు కార్యక్రమం జరుగుతుందన్నారు. అమ్మవారికి పట్టు పీతాంబర వస్త్రాలు వెంకటగిరి రాజా గార్ల కుటుంబ సభ్యులు అందజేస్తారన్నారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలన్నారు.