ప్రస్తుత వర్షాకాలంలో వ్యాధులు రాకుండా నియంత్రించేందుకు ప్రజలందరూ ఇళ్ల ముందునీరు నిల్వ లేకుండా ప్రవహించే విధంగా చూసుకోవాలని, శుక్రవారం మధ్యాహ్నం గంట్యాడ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హేమలత సూచించారు. సిహెచ్ఓ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు ఇళ్లకు వచ్చేటప్పుడు నీరు నిల్వ లేకుండా ప్రవహించే విధంగా చర్యలు తీసుకుని సహకరించాలని కోరారు. కలుషిత నీటిని తాగడం వల్ల జ్వరాలు డయేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు.