మీసేవ కేంద్రాల నిర్వహకులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ హెచ్చరించారు శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీసేవ కేంద్రాల నిర్వహణ వివిధ సేవలకు నిర్ధారించిన రుసుము తదితర అంశాలపై మీసేవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవ కేంద్రాలు రసీదు పై చూపబడిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని నిర్వాహకులఇలాంటి వాటికి పాల్పడితే మీ సేవ కేంద్రం గుర్తింపు రద్దు చేయడం జరుగుతుందని అన్నారు