శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లిలో వ్యవసాయ పొలంలో ఉంచిన విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ లో రాగి వైరు ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి అందులో వైరు ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతు మహబూబ్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్న క్రమంలో ఇలా జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నా