మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపంలోని వీటి పిఎస్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో లోకల్ లారీలకు అనుమతి ఇవ్వాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బూడిదను తరలిస్తున్న బయట లారీలను శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక లారీ ఓనర్లు అడ్డుకున్నారు. వీటీపీఎస్ యాజమాన్యం తమకు గతంలో చెప్పిన ప్రకారం బూడిద తరలింపుకు తమకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.