తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బజార్ వీధిలో ఉన్న ఓ బంగారు దుకాణంలో ఇద్దరు మహిళలు సోమవారం వెండి వస్తువులను అపహరించేందుకు యత్నించారు. అయితే దుకాణదారుడు అప్రమత్తమై వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరుగులు తీశారు. వెంబడించిన స్థానికులు రాజగోపాలపురం ప్రాంతంలో ఒక మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో మహిళ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నాయుడుపేటలో ఈ సీసీ ఫుటేజ్ వీడియో హల్చల్ చేస్తుంది.