నల్గొండ జిల్లా: భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులందరికీ కలిసి సెప్టెంబర్ 20 న నల్గొండ పట్టణంలో జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి సలీం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో సుందరయ్య భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సలీం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ను ఆదుకోవాలన్నారు.కార్మికుల కు రావలసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.