భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దినేష్ ,గోదావరికి చెందిన వేణు ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ ఐటిసి సిగరెట్లు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా ఇద్దరి వద్ద 1,57,000 విలువ గల నకిలీ సిగరెట్ ప్యాకెట్లు లభించినట్లు,ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సిసిఎస్ సిఐ రవీందర్ శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై తాజుద్దీన్ ,పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.