రుద్రూరు మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సావిత్రి (62) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు. ఈనెల 11న కడుపునొప్పి బాధ భరించలేక సదరు మహిళ యాసిడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మహిళా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.