బేతంచెర్లలోని ప్రజలు మలేరియా, డెంగ్యూ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర రావు, సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ హరి ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఏ విధంగా వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలని విషయంపై అవగాహన కల్పించారు