ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది సోమవారం సాయంత్రం కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపవరం హైవేలో జరిగిన టాటా ఏసీ వాహనాలు నడుపుతున్న డ్రైవర్ ఏసు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదాన్ని చూసిన వంగవీటి రాధా రంగా మిత్రమండలి రాజమండ్రి నగర అధ్యక్షుడు పురంశెట్టి వీరబాబు సమాచారాన్ని పోలీసులకు 108 సిబ్బందికి అందించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వైద్య సేవ నిమిత్తం తరలించారు.