కర్నూలు టౌన్ లో 32వ వార్డ్ గోవర్ధన్‌నగర్‌లో నిర్మించిన రైతుబజార్‌ను ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం DYFI, ఐద్వా, CITU ఆధ్వర్యంలో రైతుబజార్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిటియు నాయకుడు సుధాకరప్ప, DYFI నగర కార్యదర్శి హుసేన్ బాషా, ఐద్వా కార్యదర్శి లక్ష్మి బాయి మాట్లాడుతూ.. ‘‘ఈ రైతుబజార్ కోసం ఎన్నో పోరాటాలు చేశాం. ప్రభుత్వాలు మంజూరు చేసినా, గత వైసీపీ ప్రభుత్వం చివర్లో నిర్మాణం చేపట్టి వదిలేసింది. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల ఓట్లు దండుకుని గెలిచినా ఇప్పటికీ ప్రారంభించలేకపోతోంది’’ అని విమర్శించారు.ప్రజల ఆశలపై నీళ్