కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం మంగనపల్లెలో శనివారం బద్వేల్ వైసిపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మంగనపల్లె గ్రామానికి చెందిన ధూపాటి కృష్ణయ్య కిడ్నీ వ్యాధితో శుక్రవారం రాత్రి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న బద్వేల్ వైసిపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి మృతుడి నివాసానికి చేరుకుని, కృష్ణయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి ధైర్యం చెప్పారు.