కృష్ణా నదికి భారీ వరద నేపథ్యంలో సాగునీటి సంఘ అధ్యక్షుడు చర్యలు చేపట్టారు. మోపిదేవి మండలం ఉత్తర చిరువోలులంక, అయోధ్య మధ్య కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న ఔట్ ఫాల్ స్లూయీజుల వద్ద నుంచి వరద నీరు పొలాల్లోకి ఎగదట్టకుండా ఇసుక బస్తాలు వేయించారు. సాగునీటి సంఘ అధ్యక్షుడు సాంబశివరావు, సభ్యులు రామాంజనేయులు, ఆర్.సీ ఏఈఈ హరీశ్, లస్కర్ వెంకన్న పర్యవేక్షించారు.